Natyam ad

23న చంద్రుడికి చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్

బెంగళూరు ముచ్చట్లు:


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 జాబిల్లికి మరింత దగ్గరయ్యింది. ఈసారి వ్యోమనౌక కక్ష్య కొంచెం తగ్గించినట్లు ఇస్రో పేర్కొంది. దాని వలన  ప్రస్తుతం చంద్రయాన్-3 వ్యోమనౌక.. చంద్రుడి ఉపరితలానికి కేవలం 1,437 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రయాన్‌ 3 ని ప్రయోగించిన తరువాత సుమారు 24 రోజుల పాటు భూ కక్ష్యలోనే ఉంది. అప్పటి  నుంచి దశల వారీగా కక్ష్యను పెంచుతూ ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోనికి ప్రవేశ పెట్టారు. ఆగస్ట్ 1 న ట్రాన్స్‌లూనార్‌ కక్ష్యలోకి  వెళ్లింది. ఆగస్టు 14న చంద్రయాన్‌ 3 మరో నియంత్రిత కదలికలో చంద్రుని ఉపరితలానికి చేరవవుతుంది. ఆగష్టు 16న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్.. దాని ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి వేరు పడుతుంది. దీంతో చంద్రయాన్‌ 3 చంద్రునికి మరింత దగ్గర కానుంది. ఈ సమయంలో చంద్రుడికి దాదాపు 110 కి.మీ దూరంలో ఉంటుంది. చివరిగా ఆగస్టు 18న చంద్రయాన్‌ 3 లాస్ట్‌ ఆర్బిట్‌ మాడ్యులేషన్ ను సరిచేయడం వల్ల దాదాపు 30 కి.మీ లకు తగ్గించడం ద్వారా చంద్రునికి అత్యంత సమీపంగా వెళ్లనుంది.

 

 

221అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే కనుక ఆగస్టు 23న సాయంత్రం 5: 47 గంటలకు చంద్రయాన్‌ 3 ల్యాండింగ్‌ చేపట్టనున్నారు. అక్కడి నుంచి చంద్రయాన్‌ 3 ఆఖరుగా 30 కి.మీ ప్రయాణిస్తుంది. ఒకవేళ అక్కడి వాతావరణం కానీ అనుకూలించకపోతే కనుక సెప్టెంబర్‌ కు రీ షెడ్యూల్‌ చేసే అవకాశం ఉన్నటుల ఇస్రో పేర్కొంది. ఈసారి మాత్రం ఇస్రో పక్కా ప్లాన్‌ తో ముందుకు వెళ్తోంది. ఇస్రో మాత్రం ఈసారి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చంద్రయాన్ 2 చివరి ప్రయత్నంలో ఫెయిల్‌ అయ్యింది. దీంతో ఈసారి ఇస్రో శాస్త్రవేత్తలు దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పటికే అప్పుడు పొరపాటు మళ్లీ పునరావృతం కాకుండా చంద్రయాన్ 3 ని చేపట్టినట్లు ఇప్పటికే ఇస్రో ఛైర్మన్‌ పేర్కొన్నారు. కానీ, చంద్రయాన్‌ 3 చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆ తర్వాత ప్రక్రియ చాలా సవాల్‌తో కూడుకున్నదని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. ల్యాండర్ విక్రమ్, అన్ని సెన్సార్లు, దాని రెండు ఇంజిన్లు పని చేయకపోయినా ఆగస్టు 23 న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయగలదని వివరించారు.

 

Post Midle

Tags: Chandrayaan soft landing on the moon on 23rd

Post Midle