విద్యా విధానంలో మార్పు రావాలి

Change in education policy

Change in education policy

Date:09/01/2019
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖపట్నం లోని ఆంధ్రా విశ్వవిద్యాలయం లో 85, 86 స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ , ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ రావుగోపాల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా 546 మందికి డాక్టరేట్లును గవర్నర్ నరసింహాన్ అందచేశారు. గవర్నర్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మార్పు రావాలని అన్నారు. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో వ్యవస్థ ఉండాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు పోటీపడాలని అనుకోవడం పెద్ద నేరమని తెలిపారు. వైద్య రంగంలో ఇప్పటికే ప్రైవేటు హవా పెరిగిందని, వైద్య, విద్యా రంగాలు ప్రభుత్వం చేతిలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఈ రంగాలను పూర్తిగా ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. పీహెచ్‌డీల్లో నాణ్యతపై దృష్టి సారించాలని గవర్నర్‌ సూచించారు. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఢిల్లీ ఐఐటి డైరెక్టర్ ఆచార్య రామగోపాల్ రావుకు గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ ప్రధానం చేశారు.
Tags:Change in education policy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *