హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు

పదవులకు యార్లగడ్డ రాజీనామా

విశాఖపట్నం ముచ్చట్లు:

ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరును వైయస్సార్ విశ్వవిద్యాలయం గా మార్చడం చాలా బాధాకరం. పేరు మార్చడం పై దుక్కిస్తూ నా మూడు పదవులకు రాజీనామా చేస్తున్నానని  అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రకటించారు. ఎన్ టి ఆర్ కు భారతరత్న ఇస్తామంటే చంద్రబాబు వద్దు అంటున్నారు. చంద్రబాబు ఎన్ టి ఆర్ కు ఏమి చెయ్యలేదు. సీఎం జగన్ ఒక జిల్లా కు ఎన్ టి ఆర్ పేరు పెట్టారు. తెలుగు  భాషా కు సీఎం జగన్ చేసిన సేవ ఎవరు చెయ్యలేదు. సీఎం జగన్ నన్ను ఎంతో గౌరవం తో చూసారు. హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం చాలా విచారకరం. ఈ విషయం లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  ఆత్మ కూడా శాంతించదు. బంజారాహిల్స్ లో ఎన్ టి ఆర్ తుదిశ్వాస విడిచిన గృహాన్ని కులగొట్టి అపార్ట్మెంట్ నిర్మించారు. నాకు ఎవరిపైన  కోపాలు ,విద్వేషాలు లేవు. పదవులకు రాజీనామా చేసిన తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

 

Tags: Change of name of Health University

Leave A Reply

Your email address will not be published.