పేరంట్స్ మైండ్ సెట్ మారాలి 

Change the parent's mind set

Change the parent's mind set

Date:17/09/2018
నల్గొండ ముచ్చట్లు:
మిర్యాలగూడ యువకుడు ప్రణయ్ హత్యోందతంపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. కూతురు తమ కంటే తక్కువ కులం యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుందనే అక్కసుతో తండ్రే ఈ హత్యకు పురమాయించాడు. దారుణమైన ఈ ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. తమిళనాడులోని కౌసల్య-శంకర్‌ల హత్యతో దీనిని పోల్చుతూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ లేఖను చిన్మయి పోస్ట్ చేశారు. దేశంలో కులం ఓ జాడ్యంలా విస్తరించిందని, దీని ప్రస్తావన లేకుండా ఎవరైనా సరే మనగలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
కులం కార్డుతో పెద్ద పెద్ద కేసుల నుంచి కూడా నేరస్థులు ఇట్టే బయటపడుతున్నారని ఆమె ఆరోపించింది. కులం పేరుతో దేశంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని, అగ్ర కులాల బావిలో నీళ్లు తాగిన చిన్నారులను హింసిస్తున్నారు.. నీళ్లు, మట్టికి కులం సర్టిఫికెట్ ఇవ్వడంలో భారతీయులు విజయవంతమయ్యారని వాపోయింది. ‘ఇలాంటి మనుషుల్ని మార్చలేమని కొందరంటున్నారు.. కానీ వారి తల్లిదండ్రులు, బంధువుల మనసుల్లో నుంచి కుల జాడ్యాన్ని తొలగించరు.. కులపిచ్చి పోవాలంటే తొలుత పేరు చివరన ఉండే తోకలను కత్తిరించాల్సి ఉంటుంద’ అని చిన్మయి మండిపడింది.
అయితే, కేవలం అది మాత్రమే సరిపోదని, మనసు పొరల్లోంచి ఇది రావాలని తెలిపింది. మా వాళ్లు ఒప్పుకోరు, మా బంధువులు అంగీకరించరు, మా కుటుంబంతో వారు మాట్లాడరు అంటారు.. మరి అలాంటి బంధువులు అవసరమా అని చిన్మయి నిలదీసింది. ఒకే కులమైనా చాలామందికి ఆర్థిక స్థితిగతులు, అమెరికా వీసా లాంటివి పెళ్లి సంబంధాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చిన్మయి పేర్కొంది. పెళ్లి ఖర్చుల్లో అమ్మాయి-అబ్బాయిలది చెరో సగం అనే వాళ్లు ఎందరో ఉన్నారని, కుల పిచ్చి అన్ని మతాల్లోనూ ఉందన్న ఆమె, దానిని అంత త్వరగా నిర్మూలించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
కులం జాడ్యం నుంచి బయటపడేందుకు తనకు తెలిసిన కొన్ని సూచలను చేసిన చిన్మయి.. ఎవరైనా కుల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు దానిని సున్నితంగా తోసిపుచ్చాలని పేర్కొంది. కులం గురించి అడిగితే తెలియదని చెప్పాలని, విరివిగా పుస్తకాలు చదవడంతోపాటు సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉండాలని, ప్రతిసారీ విద్యావ్యవస్థను నిందించడం మాని పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని చిన్మయి సూచించింది.
Tags:Change the parent’s mind set

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *