ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

అమరావతి ముచ్చట్లు :

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపుల్లో పలు మార్పులు ప్రకటించింది. తాజా నిబంధనల ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు సడలింపు ఉంటుంది. అయితే, సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు సడలింపు నిచ్చిన ప్రభుత్వం ఆయాచోట్ల రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది. అదే విధంగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతి నిచ్చింది. అయితే సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌ ఉండాలని ఆంక్షలు విధించింది. ఇక కోవిడ్‌ ప్రొటోకాల్స్‌తో రెస్టారెంట్లు, జిమ్స్‌, కల్యాణ మండపాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం… శానిటైజర్‌, మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పని సరి అని పునరుద్ఘాటించింది.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Changes in curfew relaxation in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *