చిన్నమ్మ ఎంట్రీతో మారిపోతున్న సమీకరణాలు

Date:23/02/2021

చెన్నై ముచ్చట్లు:

శశికళ రాకతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. క్రమంగా శశికళ పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో శశికళ ముందుకు వెళుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేేసే అవకాశం లేకపోయినా తన మద్దతుదారులను భారీ సంఖ్యలో గెలిపించుకుని తమిళనాడు ఎన్నికల్లో కింగ్ మేకర్ కావాలన్నది శశికళ ఆలోచనగా ఉంది. ఇందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ ను ఆమె ప్రారంభించారు.తమిళనాడులో అవినీతిని పెద్దగా పట్టించుకోరు. అందుకే శశికళ విషయంలో కూడా ఎన్నికల్లో అవినీతి జీరో ప్రభావమే చూపుతుంది. గతంలో జయలలిత, కరుణానిధిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ వారికే అధికారాన్ని తమిళులు కట్టబెట్టారు. జైలు నుంచి తిరిగి వచ్చిన శశికళ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను ఇబ్బంది పెట్టడమే శశికళ ప్రతి అడుగులో కన్పిస్తుందన్నది మాత్రం వాస్తవం.అయితే శశికళ ప్రతి అడుగూ డీఎంకే కు అనుకూలంగా మారుతుందంటున్నారు విశ్లేషకులు. శశికళ చేతిలో అన్నాడీఎంకే లేదు.

 

 

 

రెండాకుల గుర్తు కూడా లేదు. దీంతో ఆమె అమ్మ మున్నేట్ర కళగం పార్టీ తరుపున ప్రచారం నిర్వహించినా అధికార పార్టీ అన్నాడీఎంకే ఓట్లను మాత్రమే చీల్చుగలుగుతుందని అన్ని పార్టీలూ అంచనా వేస్తున్నాయి. ఇది డీఎంకే కు లాభం చేకూరుస్తాయంటున్నారు.అందుకే అన్నాడీఎంకే కూటమిలోని పార్టీలు కూడా డీఎంకే కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. శశికళ రాకతో రాజకీయ ఈక్వేషన్లు మారడంతో పీఎంకే, ఎంజేకే వంటి పార్టీలూ డీఎంకే పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నాయి. అన్నాడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం జయలలితను ఎంత ఓన్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, శశికళ భారీ సంఖ్యలో ఆ పార్టీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశముంది. అందుకే శశికళ ఎంట్రీతో అన్నాడీఎంకే కూటమి ఆశలు అడుగంటాయనే చెప్పాలి.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Changing equations with Chinnamma entry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *