మారిపోతున్న సర్కారీ భూముల హద్దులు

నిజామాబాద్ ముచ్చట్లు:


భూ నిర్వాసితులకు, భూమి లేని పేదలకు, దళితులకు, గిరిజనులకు ప్రభుత్వం సాగు కోసం కేటాయించే సాగు భూములు, నివాసం కోసం కేటాయించే నివాస స్థలాలు అనుభవించడానికి మాత్రమే అర్హత ఉంటుంది. వాటిని అమ్ముకోవడం, కొనుగోలు చేయడం లాంటివి నిషేధం అని రెవెన్యూ (అసైండ్, పిఓటి) చట్టాలు చెబుతున్నాయి. కాని కామారెడ్డి జిల్లా నస్రూల్లా బాద్ మండలం కంపల గండిలో గతంలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూములు చేతులు మారాయి. పేదల ఆర్థిక అవసరాలను ఆసరగా చేసుకుని వాటిని కొందరు ప్రైవేటు వ్యక్తులు లీజ్ తీసుకోవడం వాటికి రెవెన్యూ శాఖ అధికారులు పట్టాల మార్పిడి చేయడం గమనార్హం.ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం భూమి లేని పేదలకు సాగు నిమిత్తం ఏడు విడతల్లో వందల ఎకరాల భూ పంపిణీ చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ చేసింది. మొదటి విడత భూ పంపిణీ పూర్తి చేసింది. కానీ రెండో దఫా కు వచ్చే సరికి భూములు లేకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూములు కొనుగోలు చేసి పంపిణీ చేయాలని సంకల్పించిన భూమి దొరక్కపోవడంతో అ పథకం అటకెక్కింది. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూమిని అనుభవించడం మినహ క్రయ విక్రయాలకు ఆస్కారం ఉండదు.

 

 

వాటిని ఇతరుల పేర్ల మీదకు బదలాయింపు ఉండదు. అని రెవెన్యూ చట్టాలు, అసైండ్ అండ్ పిఓటి చట్టాలలో స్పష్టంగా ఉంది.ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గా ఉన్నప్పుడు బీర్కూర్ మండలం నస్రుల్లాబాద్ గ్రామం పరిధిలోని రైతులకు సాగునీరు అందించేందుకు 1982లో బైరాపూర్, బస్వాపూర్ శివారులో ఖాన్ చెరువును నిర్మాణం చేపట్టారు. ఈ చెరువు నిర్మాణంలో బైరాపూర్, బస్వాపూర్ గ్రామానికి చెందిన 36 మంది రైతుల భూములు ముంపుకు గురయ్యాయి. తమ భూములు ముంపుకు గురి కావడంతో సాగు చేసుకోవడానికి భూమి లేక ఇబ్బందులు పడుతున్నామంటూ.. భూములు కోల్పోయిన రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూములు కోల్పోయిన 36 మందికి రెండో విడత భూమి పంపిణీ కార్యక్రమంలో భాగంగా భూములను అప్పగించారు. బైరా పూర్ గ్రామంలో భూములు కోల్పోయిన వారికి 28/3 సర్వేనెంబర్ కింద 25 ఎకరాల భూమిని కంపల గండిలో అందజేశారు. కానీ ప్రభుత్వం చూపిన భూమిలో ఈత వనాలు ఉండటంతో వాటిని సాగు చేయడానికి భూమి అనుకూలంగా లేకపోవడంతో రైతులు పట్టాలు పొంది బ్యాంకుల ద్వారా వచ్చే రుణాలను పొంది జీవిస్తున్నారు. బిర్కూర్ మండలానికి చెందిన కొందరు 26 మంది వద్ద నుంచి పట్టా పాస్ పుస్తకాలను తీసుకొని వారికి అవసరం ఉన్నప్పుడల్లా ఎంతోకొంత డబ్బులు ముట్ట చెప్పి, ఆ పట్టాదారు పాసు పుస్తకాలను స్వాహా చేశారు. వాటిని ఆధారంగా పెట్టుకుని కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టా పాస్ పుస్తకాలు పొందారు.

 

 

Post Midle

కోట్ల రూపాయల విలువ చేసే భూములను బదలాయింపు చేయకూడదంటూ అధికారులు ఇచ్చిన నిబంధనలు పక్కాగా సూచించినప్పటికీ గతంలో బీర్కూర్‌లో తహశీల్దార్‌గా పనిచేసిన వారికి కాసులు గుమ్మరించి ఆ భూమిపై యాజమాన్య హక్కు పత్రాన్ని సృష్టించి ఆ భూమి అధీనంలోకి తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల పేరిట కంపల గండిలో 10 ఎకరాల భూమిని పట్టా చేయించుకున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం భూమిపై ఎవరు దృష్టి పెట్టకపోవడంతో పెద్ద పెద్ద యంత్రాలను పెట్టి ఈత వనాలను తొలగిస్తూ వంద ఎకరాలకు పైగా భూమిని సాగు భూమిగా మారుస్తున్నాడు. ఇంత పెద్ద ఎత్తున కంప గండిలో భూ బాగోతం కొనసాగుతుంటే రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా నిరుపేద అర, లేదా పావు ఎకరం భూమిని కబ్జా చేస్తే వారిపై కేసులు పెట్టి, సవాలక్ష సమస్యలు సృష్టించే రెవెన్యూ అధికారులు ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణానికి పాల్పడుతుంటే ఆయనపై చర్యలు తీసుకోకపోవడం పై అధికారుల పనితీరు పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయిప్రభుత్వం పేదలకు ముఖ్యంగా భూ నిర్వాసితులకు ఇచ్చిన భూములను ఒక వ్యక్తికి పదుల సంఖ్యలో ప్రభుత్వానికి చెందిన భూములను పట్టాలు చేసిన కొంతమంది రెవెన్యూ అధికారులు బాగోతం బయటపడే అవకాశాలు ఉన్నాయి. కంప గండిలో సమగ్రంగా జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు సర్వే చేస్తే అసలు విషయం వెలుగులోకి వస్తోందని.. కొంత మంది అవినీతి రెవెన్యూ అధికారుల బాగోతం బయట పడుతుంది.. అన్న భయంతో సర్వే చేయడానికి ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

Tags: Changing government land boundaries

Post Midle
Natyam ad