రూ 30 లక్షల మూడు వేలకు చాపరాయి టెండర్

డుంబ్రిగుడ ముచ్చట్లు:
 
స్థానిక పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం టెండర్ పాట రూ 30లక్షల 3వేలుకు కమిటీ భాస్కరరావు వేలం పాటను దక్కించుకున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం చాపరాయి జలపాతం టెండర్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటకు 91 మంది డిపాజిట్లు చేసి ఉండగా కామెడీ భాస్కరరావు వేలం పాటను దక్కించుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ వి అభిషేక్ మాట్లాడుతూ చాపరాయి జలపాతం లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటకులు వచ్చి స్థానికంగా ఉండేందుకు రూ 50 లక్షలతో కాటేజీలు నిర్మాణం చేయడానికి కూడా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. దీంతోపాటు శివాలయ దేవాలయం నిర్మాణం మూడు నెలల లోపు పూర్తి చేపడతామని చెప్పారు. పర్యాటకులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జయ ప్రకాష్, ఆర్ ఐ ఓ రామ్మూర్తి, శ్రీకాంత్, వీఆర్వో ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Chaparai tender for Rs 30 lakh three thousand

Natyam ad