వెంటాడుతున్న కలుషిత నీరు..

Chasing water

Chasing water

Date:26/11/2018
గుంటూరు ముచ్చట్లు:
సురక్షిత తాగునీరు అందక నానాపాట్లు పడుతున్నామని గుంటూరుజిల్లా చిలకలూరిపేట వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. తాగునీటి పైపులు లీక్ అవుతున్నా..వాటిలో డ్రైనేజ్ నీరు కలుస్తున్నా సమస్యను పరిష్కరించడంలేదని మండిపడుతున్నారు. నీటి పైప్ లైన్లు వేసి దాదాపు 30ఏళ్లు గడిచిందని దీంతో అవి పాడై సమస్యాత్మకంగా మారాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కలుషిత నీటి సరఫరాకు చెక్ పడాలంటే.. కొత్త పైప్ లైన్స్ వేయడం ఒక్కటే సరైన పరిష్కారమని స్పష్టంచేస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వేసిన పైప్ లైన్లను ఇప్పటికీ మార్చలేదు. దీంతో అవి లీకులై డ్రెయిన్‌ వాటర్‌ మంచినీరుతో కలుస్తున్నట్లు పట్టణవాసులు చాలాకాలంగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. నీరు కలుషితం అవుతుండడంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ప్రతి 100 మందిలో 20 మందికి అనారోగ్య సమస్యలకు గురువుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు.
కలుషిత నీరు సరఫరా అవతుండటంతో పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. పట్టణానికి సమీపంలో ఉన్న రెండు చెరువుల నుండి వాటర్‌ ట్యాంక్‌లను నింపుతున్నారు.
అక్కడ వాటిని ఫీల్టర్‌ చేసి
నీటిని విడుదల చేస్తుండాలి. కానీ చెరువు నుండి ట్యాంక్‌లకు వస్తున్న నీరు నేరుగా పైప్‌లైన్లకు వదులుతున్నారు. ఆ నీరు రెండు రోజుల కంటే నిల్వ ఉంటే రంగు మారిపోతుంది. అందులో
పురుగులు కూడా వస్తున్నాయి. గతంలో అప్పుడప్పుడు నీటిలో బ్లీచింగ్‌ పౌడర్‌ వేసేవారు. ఇప్పుడు అది కూడా చేయడంలేదని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కలుషిత నీటిని తాగిన, వాడిన అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని అంటున్నారు. ఒక వేళ ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేసినా ఈ సమస్య వదిలేలా లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కలుషిత నీటి సరఫరాకు తెరపడాలంటే కొత్త పైప్ లైన్స్ ఏర్పాటే ఏకైక మార్గమని అంటున్నారు. ఇదిలాఉంటే పైపుల మరమ్మతుల పేరిట ఏటా రూ.లక్షలు బిల్లులు చూపిస్తున్నారు. స్థానికంగా మాత్రం లీకేజీల సమస్యకు చెక్ పడడంలేదని పలువురు అంటున్నారు. సంబంధిత సిబ్బంది నిధులను పక్కదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు సైతం చేస్తున్నారు. ఈ విషయమై నిలదీసే వారు.. చర్యలు తీసుకునే వారు లేకపోవడంతో నిధులను కొందరు క్యాష్ చేసుకుంటున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు.
Tags:Chasing water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *