పుంగనూరులో చత్రపతి శివాజి హిందూ శోభాయాత్ర

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేట నుంచి చత్రపతి శివాజి హిందూ శోభాయాత్రను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. హిందూజాగరణ సమితి అధ్యక్షుడు త్రిమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఎన్‌ఎస్‌.పేట, కట్టక్రిందపాళ్యెం, కుమ్మరవీధి, తూర్పువెహోగశాల, ఎంబిటి రోడ్డు, ఇందిరాసర్కిల్‌ మీదుగా గోకుల్‌ సర్కిల్‌ వరకు నిర్వహించారు. యువకులు ద్విచక్రవాహనాలకు కాషాయజెండాలు కట్టి నినాదాలతో పురవీధుల్లో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండ సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాగరణ సమితి సభ్యులు లోకేష్‌జెట్టి, పరమేష్‌, గంగాధర్‌, హరి, గౌతమ్‌, సాయి, మధు, కార్తీక్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Chatrapati Shivaji Hindu Shobhayatra in Punganur

Post Midle
Natyam ad