పుంగనూరులో 12న చత్రపతి శివాజి శోభయాత్ర

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేట నుంచి చత్రపతి శివాజి శోభయాత్రను ఆదివారం నిర్వహిస్తున్నట్లు హిందూజాగరణ సమితి అధ్యక్షుడు త్రిమూర్తిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజి పేరుతో నిర్వహిస్తున్న హిందూశోభయాత్రను పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేట, కట్టక్రిందపాళ్యెం, కుమ్మరవీధి, తూర్పు మోగశాల, ఎంబిటి రోడ్డు, ఇందిరాసర్కిల్‌ మీదుగా గోకుల్‌ సర్కిల్‌ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిఒక్కరు పాల్గొని హిందూ శోభయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈమేరకు పట్టణంలో కషాయ జెండాలను ఏర్పాటు చేసి చత్రపతి శివాజి ప్లెక్సిలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాగరణ సమితి సభ్యులు పరమేష్‌, గంగాధర్‌, హరి, గౌతమ్‌, సాయి, మధు, కార్తీక్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Chatrapati Shivaji Shobhayatra on 12th at Punganur

Post Midle
Natyam ad