Natyam ad

అన్నపూర్ణ దేవి అలంకారంలో చౌడేశ్వరి దేవి

రామసముద్రం ముచ్చట్లు:

మండలలో అన్ని శక్తీ దేవాలయాలలో దసరా ఉత్సవాలు గురువారం వైభవంగా నిర్వహించారూ. గుంతలపేటలో అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే రామసముద్రంలోని శ్రీ దుర్గమ్మ ఆలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, శ్రీ లక్ష్మీ జనార్దన్ స్వామి ఆలయం, గుంతయంబాడిలోని శ్రీ చౌడేశ్వరి దేవి, తిరుమల రెడ్లపల్లిలోని శ్రీ మారెమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంపన పల్లెలో చౌడేశ్వరి దేవి ఆలయం, నరసాపురం లోని శ్రీ మునీశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ఆలయాలలో ప్రతిరోజు దేవి నవరాత్రులు దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వివిధ అలంకారాలతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఆలయాల వద్ద రాత్రి సాంస్కృతి భాగంగా భజన కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించారు.

 

Post Midle

Tags: Chaudeshwari Devi in Annapurna Devi Alankaram

Post Midle