చావనైన చస్తా…పుంగనూరుకు వెళ్లడం ఖాయం- ఎంపీ మిధున్‌రెడ్డి ఆగ్రహం

-నా ప్రజలను కలుసుకుంటే అడ్డుకుంటారా..
– ఇదే నా ప్రజాస్వామ్యం
-మాకు 40 శాతం మంది ప్రజలు ఓట్లు వేశారు
– ఎంత నిర్భంధించిన నా ప్రజలను కలుస్తా

తిరుపతి ముచ్చట్లు:

 

నా స్వంత నియోజకవర్గంలో ప్రజలను కలుసుకునేందుకు వెళ్తే అడ్డుకుంటారా…ఇదేనా ప్రజాస్వామ్యం …ఎంత నిర్భంధించిన నేను పుంగనూరుకు వెళ్తా….ప్రజలను కలుస్తా … నా కార్యకర్తలకు అండగా ఉంటా…ఈ పోరాటంలో చావడానికైన సిద్ధం అంటు ఎంపీ మిధున్‌రెడ్డి అధికార పార్టీ ఆగడాలపై విరుచుకు పడ్డారు. ఆదివారం పుంగనూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని ఎంపీ మిధున్‌రెడ్డి ఏర్పాటు చేశారు. దీనిపై అధికార పార్టీ వారు పోలీసులను పంపి ఎంపీ మిధున్‌రెడ్డిని తిరుపతిలో గృహనిర్భంధం చేశారు. దీనిపై ఎంపీ మిధున్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికార పార్టీ ఆగడాలు మీరిపోతోందని , దీనిని అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యకర్తలపై దాడులు, ఆస్తుల ధ్వంసం సహించేది లేదన్నారు. వైఎస్సార్‌సీపీకి 40 మంది ప్రజలు ఓట్లు వేశారని, దీనిని అధికార పార్టీ గుర్తించాలన్నారు. ప్రశాంతమైన పుంగనూరులో రాక్షస పాలనను అధికార పార్టీ వారు సాగిస్తూ జర్మన్‌ బస్సుల కంపెనీని వెనక్కు పంపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఐదేళ్లే ఉంటుందని, దీనిని గుర్తుంచుకోవాలని లేకపోతే మనుగడ ఉండదని ఎంపీ హెచ్చరించారు. చల్లాబాబు చంద్రబాబు ట్రాప్‌లో పడి మోసపోతున్నాడని తెలిపారు. రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పదవి కోసం తమపై పలు విమర్శలు చేస్తున్నాడని మిధున్‌రెడ్డి ఎద్దెవ చేశారు. ఇకనైన ఇలాంటి వాటిని ఆపివేసి , ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన సాగించాలని సూచించారు.

    

Tags: Chavanina Chasta…is certain to go to Punganur- MP Midhun Reddy is angry

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *