రాముడి నాణేల పేరిట చీటింగ్
పోలీసుల అదుపులో గ్యాంగ్
విశాఖపట్నం ముచ్చట్లు:
సైన్స్ అండ్ టెక్నాలజీ ఓ వైపు రాకెట్ వేగంతో దూసుకుపోతు న్నప్పటికీ డబ్బుమీద ఆశతో సాధారణ మనిషి మాత్రం ఇంకా ఎక్కడో ఆగిపో యాడు. ఇదే బలహీనతను ఆసరాగా చేసుకుని చెవిలో పువ్వులు పెడుతు న్నారు కొంతమంది కేటుగాళ్లు. అలాం టి ఘటనే ఒకటి అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.మా దగ్గర అతీంద్రియ శక్తులున్న నాణే లు ఉన్నాయి. వీటికి ఆకర్షణ శక్తి ఉం ది.శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా రూపొందించిన ఈ నాణేనికి.. కోట్లు విలువజేస్తుందంటూ వ్యాపారులను మోసం చేస్తున్న ముఠాను చింతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నా రు. ఈ ముఠా నాణేనికి రసాయనాలు పూసి ఆకర్షణ శక్తి ఉందని నమ్మిస్తూ మోసగిస్తున్న ట్లు పోలీసులు వివరిం చారు.అరకు వ్యాలీ మాలసింగారానికి చెందిన వంతల పూర్ణ, బుజ్జి, మనోజ్, పొట్టి రామదాసు, ప్రేమ్ కుమార్ అనే వ్యక్తులను చింతపల్లి పోలీసులు అదు పులోకి తీసుకున్నారు.ఈ ముఠా తమ వద్ద ఉన్న పురాతన నాణేలు అమ్ము తామని, తిరిగి అమ్మితే కోట్లువస్తా యంటూ ఆశజూపి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు,

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారి పాలెనికి చెందిన కసిరెడ్డి రాజేశ్వర రావు అనే వ్యక్తిని ఇదే రకంగా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. పురా తన నాణెన్ని విక్రయిస్తామని 8 లక్షలకు బేరం కుదుర్చుకున్న నిందితులు.. డబ్బులు తీసుకుని వస్తున్న సమయం లో మార్గమధ్యలో డబ్బుతో పరారైన ట్లు వివరించారు.రాజేశ్వర రావు ఫిర్యా దుతో రంగంలోకి దిగిన చింతపల్లి పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు . వారి వద్ద నుంచి మూడు కార్లు, 7 లక్షల 87 వేల 500 రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు, ఒక రాగి నాణేన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. డబ్బు మీద ఆశతో ఇలాంటి వాటిని నమ్మ వద్దని సూచించారు చింతపల్లి పోలీసులు.
Tags: Cheating in the name of Rama’s coins
