ప్రేమ పేరుతో బాలికపై వంచన

విశాఖపట్టణం ముచ్చట్లు :

ప్రేమ పేరుతో యువకుడి వలలో చిక్కుకున్న బాలిక 16ఏళ్లకే తల్లి అయిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకుంది. రాంబిల్లి మండలం లాలంకోడూరుకు చెందిన 16 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు లాలం నవీన్‌ ప్రేమించాడు. ఏడు నెలల క్రితం బాలిక అచ్యుతాపురం మండలం కుమారపురంలోని తన తాతగారి ఇంటికి వెళ్లిన సమయంలో ఆమెను కలిసేందుకు నవీన్‌ వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు.దీంతో బాలిక గర్భం దాల్చినప్పటికీ ఆ విషయం ఆమెకు గానీ, కుటుంబసభ్యులకు గాని తెలియలేదు. మంగళవారం బాలిక కడుపునొప్పితో బాధపడటంతో కుటుంబసభ్యులు అనకాపల్లిలోని 100 పడకల ఆస్పత్రికి తరలించారు. బాలికకు పురిటినొప్పులు వస్తున్నాయని నిర్ధారించిన డాక్టర్లు ఆమెకు ప్రసవం చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మైనర్ బాలిక ప్రసవించిన ఘటనపై ఆసుపత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె తల్లిని విచారించగా.. బాలిక సన్నగా ఉండటం, గర్భం బయటికి కనిపించకపోవడంతో తనకు అనుమానం రాలేదని చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు నవీన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

భర్తను కొట్టి చంపిన భార్య

 

Tags:Cheating on a girl in the name of love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *