మిడుతూరు పోలీసు స్టేషన్ తనిఖీ

నంద్యాల ముచ్చట్లు:

 


నంద్యాల జిల్లా ఎస్పీ  కె.రఘువీర్ రెడ్డి  ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో గల మిడుతూరు పోలీస్ స్టేషన్ మంగళవారం నాడు ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ లో ఉన్న పలు రికార్డులను పరిశీలించారు.చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని,చట్ట పరిధిలో వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. స్టేషన్లో ఉన్న పిడిఎస్ రైస్ ని సంబంధిత అధికారులకు పంపించాలని ఆదేశించారు .స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడ రాజీ లేకుండా పని చేయాలని ఆదేశించారు. స్టేషన్ లో ఉన్న వాహనాలు ఏ  కేసులలో పట్టుబడ్డాయి వాటికి సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని గుట్కా, మట్కా, నాటు సారాయి తయారీ ,రవాణా ,అక్రమ మద్యం, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా మొదలగు వాటిని పూర్తిగా నియంత్రించాలని మిడ్తూర్ హెచ్ యస్ ఓ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు సీసీ ఫయాజ్  నందికొట్కూరు సిఐ .సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

 

Tags: Check at Midaturu Police Station

Leave A Reply

Your email address will not be published.