Natyam ad

ఏపీలో అవినీతికి చెక్

-ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం మరో అడుగు వేశారు!

అమరావతి ముచ్చట్లు:

 

 

ఇవాళ ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే 5000/- రూ నుoచి 10000/-రూ ఇవ్వనున్నారు.దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల అవినీతిపై ఫిర్యాదులకు మరింత వీలు కలుగుతుంది.ఎక్కడైనా, ఎవరైనా , కలెక్టరేట్‌ కార్యాలయం అయినా, ఆర్డీఓ, కార్యాలయం అయినా, విద్యుత్ శాఖ కార్యాలయం అయినా, సబ్ ‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం (తహసీల్దార్) అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే..14400కి ఫోన్ చేసి మీ యొక్క ఆర్జి లేఖ ఆ అధికారి పేరుతో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.పాస్ బుక్, కుటుంబ సభ్యులతో కూడిన సర్టిఫికేట్, జనన – మరణ ధ్రువీకరణ పత్రం, కులము, ఆదాయము, EWS ఇలా అనేక సర్వీసులు సంబంధించిన నెంబర్స్ తో ఫిర్యాదులు చెయ్యాలని కోరారు.ఎవరైనా చేయాల్సింది ఒక్కటేనని అదే ఆర్జి నెంబర్, లేఖ సంబంధించిన కార్యాలయంలోని సిబ్బంది వివరాలతో ఫోన్ చెయ్యండి…గిఫ్ట్ పట్టండి.

 

 

 

Post Midle

తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి, బటన్‌ ప్రెస్‌చేసి వీడియోద్వారా కాని, ఆడియోద్వారా కాని సంభాషణను రికార్డు చేయాలని అవినీతి నిరోధక శాఖ సూచించారు.ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందన్నారు.అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నామన్నారు.ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుందన్నారు.ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందని జగన్ తెలిపారు.అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు.ఎవరైనా పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

 

Tags:Check corruption in AP

Post Midle