పారదర్శకంగా ఉపాధి హామీ పనులు తనిఖీ
చౌడేపల్లి ముచ్చట్లు:
పారదర్శకంగా ఉపాధి హామీ పనులను తనిఖీలు చేస్తున్నట్లు ఎస్ఆర్పి జేఎస్ రాజు తెలిపారు. చౌడేపల్లి మండలంలోని 11 గ్రామపంచాయతీలలో శనివారం సామాజిక తనిఖీ ప్రక్రియను ప్రారంభించారు. 1750 పనులకు సుమారు 7 కోట్ల వ్యయం ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ పనులను డిఆర్పీలు రికార్డుల ఆధారంగా వారం రోజులపాటు గ్రామాలను సందర్శించి పని జరిగిన ప్రదేశాలను పరిశీలించి రికార్డుల ఆధారంగా కొలతలను తనిఖీలు చేస్తామన్నారు. ప్రభుత్వం వలసల నివారణ కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని రైతులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఆర్పి వివరించారు. కూలీల హక్కులను , రాజీ లేని అంశాలను వివరించారు. సామాజిక తనిఖీలలో గుర్తించిన అంశాలను గ్రామ సభలలో వివరించి మండల సామాజిక తనిఖీ సభలో తెలియజేయునన్నట్లు చెప్పారు. ఉపాధి పనులతో పాటు హౌసింగ్ లబ్ధిదారులకు 90 పని దినాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఇరిగేషన్ శాఖ ,పంచాయతీరాజ్ శాఖ, పట్టు పరిశ్రమ శాఖ ,ఆర్డబ్ల్యూఎస్ శాఖ, నాడు నేడు తదితర శాఖల అనుసంధానంతో చేపట్టిన పనులను తనిఖీ చేయనున్నట్లు వివరించారు. ఉపాధి పథకాన్ని రైతులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లతోపాటు జాబ్ కార్డులను తనిఖీ చేసి లబ్ధిదారులతో ఎస్ఆర్పి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో డిఆర్పిలు నరేంద్రబాబు, శోబా రాణి, విజయలక్ష్మి, జానకిరామ్, రవి, నాగేంద్ర ప్రసాద్ ఉన్నారు.

Tags: Che ck employment guarantee works transparently
