ఈ సారి తాగు నీటి ఎద్దడికి చెక్

Date:15/02/2018
గుంటూరు ముచ్చట్లు:
రెండేళ్లుగా వేసవిలో జిల్లాలోని పలు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. మంచినీటి కోసం మైళ్ల దూరం నడిచిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిచోట్ల ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. గత మూడు నెలలుగా నాగార్జున సాగర్‌ కాల్వలకు కృష్ణమ్మ పరవళ్ల నేపథ్యంలో జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి.  జిల్లాల్లోని మున్సిపాలిటీలకు ఈ ఏడాది వేసవిలో నీటి ఎద్దడి సమస్య ఉండదనే చెప్పాలి. నరసరావుపేట పట్టణంతో పాటు నకరికల్లు, రొంపిచర్ల మండలాలకు నీరందించే నకరికల్లు జలాశయం నిండిపోయి తొణికిసలాడుతోంది. ఇటు సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ పట్టణాలతో పాటు ఆర్‌డబ్యూఎస్‌ చెరువులకు నీరు పుష్కలంగా చేరింది. నకరికల్లు జలాశయం జిల్లాలోనే అతి పెద్దది. సుమారు 282 ఎకరాల విస్తీర్ణంలో ఉండి 4500 మిలియన్‌ లీటర్ల నీటి నిలువ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం 4500 ఎంఎల్‌ నీరు ఉంది. సదరు రిజర్వాయరు నుంచి నరసరావుపేట పట్టణంలోని 1.12 లక్షల జనాభాతో పాటు నకరికల్లు, రొంపిచర్ల మండలాల్లోని మరో 30 వేల మందికి పైగా జనాలకు తాగునీరందుతోంది. గత ఏడాది నెలలో చుక్కనీరు లేక జలాశయం వట్టిపోయింది. రిజర్వాయర్‌ పూర్తిగా ఎండిపోవటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. పట్టణంతో పాటు పల్లెలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం జలాశయంలో నీరు పుష్కలంగా ఉండటంతో ఆరు నెలలు పాటు తాగునీటికి ఢోకా లేకుండా పోయిందని ప్రజారోగ్యశాకాధికారులు చెబుతున్నారు.
Tags: Check for drinking water this time

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *