పుంగనూరులో జగనన్న భూహక్కు సర్వేతో సమస్యలకు చెక్- ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల భూ సమస్యలను పరిష్కరించేందుకు జగనన్న భూహక్కు సర్వేతో సమస్యలు మటుమయమౌతుందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఏటవాకిలి గ్రామంలో తహశీల్ధార్ వెంకట్రాయులు ఆధ్వర్యంలో భూముల సర్వే కార్యక్రమాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి కలసి పూజ చేసి ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ సుమారు 60 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రైతు సమస్యలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి జగనన్న శాశ్వత భూహక్కు సర్వేను ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ సర్వే ద్వారా ప్రజల భూములను , ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని విభజిస్తూ ప్రభుత్వమే సర్వేరాళ్లను నాటుతుందన్నారు. దీని ద్వారా భూముల దురాక్రమణ, రికార్డుల్లో మార్పులు లాంటివి జరగకుండ సర్వేలో నిర్ధారణ కాబడిన వ్యక్తి భూముల రికార్డులు పరిశీలించి, రెవెన్యూ రికార్డులలో నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని మండలంలో వేగవంతంగా పూర్తి చేసి, ఆదర్శంగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీపతి, మాజీ వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, సర్పంచ్ తిమ్ములమ్మ, ఎంపీటీసీ నాగభూషణ్‌రెడ్డి, సర్వేయర్లు ప్రకాష్, కృష్ణమూర్తి, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Tags: Check for problems with Jagannath land rights survey in Punganur – MP Akkisani Bhaskarreddy
