రేణుక దెబ్బతో  సీనియర్లకు చెక్…

Date:09/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ అంటే మహా సముద్రం. కార్యకర్తలతో సమానంగా నాయకులు కొలువై ఉండే పార్టీ. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం బాగా ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి పార్టీ కీలకమైన తెలంగాణ ఎన్నికల్లో చేయని హడావిడి లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఏడాది కాలంగా సీరియస్ గా కసరత్తు చేస్తూ వస్తుంది. ఒక పక్క అధిష్టానం, మరోపక్క టి పిసిసి సర్వేలు కమిటీలు వేస్తూ గెలుపు గుర్రాలకోసం తిరుగుతుంది.
ఓట్ల చీలిక నివారించేందుకు కలిసివచ్చే అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతుంది. ఏ పొత్తు లేనప్పుడే కాంగ్రెస్ లో టికెట్ల కుస్తీలు అన్ని ఇన్ని కావు కానీ టిడిపి, టిజెఎస్, సిపిఐ లతో పొత్తు కారణంగా 25 సీట్లకు పైనే కోల్పోవాలిసి వస్తుంది.  త్యాగరాజులు ఎక్కువ కాక తప్పదు. అలా త్యాగాలు చేసేందుకు ఎవరు సిద్ధంగా లేరు.
వారంతా అధిష్టానంతో యుద్ధాలు చేసే పరిస్థితి.సీన్ ఇంత సీరియస్ గా ఉండి రేపోమాపో ఇక టికెట్లు ప్రకటించేస్తారనుకున్న దశలో కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అందరి గుండెల్లో బాంబులు పేల్చారు. అవసరమైతే కొందరు సీనియర్లు పోటీకి దూరం గా ఉండి పార్టీ కోసం త్యాగాలు చేయాలని నాతో సహా ఎవరిని పక్కన పెట్టినా ఫరవాలేదని అధిష్టానానికి తేల్చి చెప్పానన్నారు రేణుక. ఆమె వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని సీనియర్లు లెక్కలు వేసుకుంటున్నారు.
ప్రత్యేకించి సీనియర్లను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది వారికి అనుమానం వచ్చేలా చేసింది. అధిష్టానమే తమ మనసులో మాట రేణుక తో పలికించారా అని కూడా కొందరు భావిస్తున్నారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్లు ముఖ్యంగా తెలంగాణ నేతల మాట విన్న అధిష్టానం ముందు వెనుక ఆలోచించకుండా ఎపి విభజన చేసేసింది.
టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందని భావించింది. తీరా విభజన జరిగాక గులాబీ పార్టీ కాంగ్రెస్ కి ఎదురు తిరిగింది అధికారంలోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడిపోయింది. అప్పటినుంచి కాంగ్రెస్ సీనియర్లపై ఒకింత అసహనంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.రాష్ట్రం ఇచ్చి కూడా దెబ్బతిన్నామన్న బాధతో వున్న కాంగ్రెస్ పాతనీరుకు గుడ్ బై కొట్టి రాహుల్ టీం ను తయారు చేసే పనిలో పడింది.
యువరక్తాన్ని పార్టీకి ఎక్కించాలన్న ఆలోచనతో కురు వృద్ధులకు వీడ్కోలు పలకడానికి ఇంతకుమించిన తరుణం లేదన్నది టెన్ జన్ పథ్ ఆలోచనగా ఉన్నట్లు రేణుక చెప్పకనే చెప్పేశారు. కాంగ్రెస్ జాబితా విడుదల సైతం ఇంతకాలం ఆలస్యం కావడానికి ఇదికూడా ఒక కారణమని ఢిల్లీ పెద్దలు అంటున్నారు. మరి ఏ సీనియర్లకు మూడిందో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ వచ్చాక కానీ వెల్లడికాదు.
Tags: Check for seniors with Renuka …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *