మహాత్మాలో బోగస్ అటెండన్స్ కు చెక్

Date:22/03/2018
నల్లగొండ  ముచ్చట్లు:
క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగామహాత్మాగాంధీ యూనివర్సిటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నది. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో విజయవంతం కావడంతో అన్ని కళాశాలల్లో అమలుకు శ్రీకారం చుడుతున్నది. ధ్యాపకులు, విద్యార్థుల ఆధార్‌ను ఎన్‌ఐసీతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక లాగిన్(విద్యాధారన్) కూడా ఇప్పటీకే వర్సిటీ ఓపెన్ చేసింది. బయోమెట్రిక్ ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలలకు మాత్రమే 2018-19లో దోస్త్ అడ్మిషన్లలో చోటు లభించనున్నది. యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 207కళాశాలలున్నాయి. వీటన్నింటిలో కచ్చితంగా ఈనెల 31లోగా బయోమెట్రిక్ మిషన్స్‌ను ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను అకాడమిక్ ఆడిట్ సెల్‌లో సమర్పించాలని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల కంటే ఎంజీయూ వేస్తున్న ముందడుగు ఆదర్శంగా నిలుస్తున్నది.ఉన్నత విద్య వ్యాప్తికి నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీని 2007-08లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్యలో మార్పు లు తీసుకొచ్చి నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఆ దిశగా ఎంజీయూ పరిధిలో ప్రస్తుత వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ యూనివర్సిటీ కళాశాలల్లో హాజరు కోసం బయోమెట్రిక్‌ను అందుబాటులోకి తెచ్చి విజయవంతం చేశారు. దీంతో వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో కూడా బోగస్ అధ్యాపకులు, విద్యార్థులు లేకుండా చేసి ఉన్నత విద్యలో ప్రభుత్వ లక్ష్యాన్ని అమ లు పరిచేందుకు 2018-19 విద్యాసంవత్సరంలో అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టారు. ఎంజీయూ పరిధిలో ఉన్న 207 కళాశాలల్లో కచ్చితంగా బయోమెట్రిక్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలతో ఇప్పటికే పలు పర్యాయాలు సమావేశాలు నిర్వహించారు. దానిలో భాగంగానే ఈ నెల 31లోగా యూనివర్సిటీ నిర్ణయించిన నిబంధనల మేరకు బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసి పూర్తి సమాచారాన్ని వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్‌లో సంబంధించిన ధ్రువపత్రాలు, కళాశాలల్లో ఎక్కడ వాటిని ఏర్పాటు చేశారో వాటి ఫొటోలను అందజేయాలని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ. యు.ఉమేష్‌కుమార్ వీసీ ప్రొ॥ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీచేశారు.  ఆధార్ ప్రక్రియను పర్యవేక్షించే సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్‌ఐసీ). ఎంజీ యూ పరిధిలోని ఆధార్ అనుసంధానంతో అన్ని కళాశాలలల్లో ఆధార్ లింక్‌తో కూడిన బయోమెట్రిక్ హాజరును అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటూ దాని పర్యవేక్షించేందుకు ఎన్‌ఐసీతో ఎంజీయూ ఒప్పందం(మెమోరండం ఆఫ్ అడర్‌స్టాండింగ్-ఎంఓయూ) చేసుకుంది. అక్కడి నుంచి లింక్‌తో హాజరును పర్యవేక్షించేందుకు ఎంజీయూ విద్యాధారన్ లాగిన్‌ను ఏర్పా టు చేసి లింక్ ఇస్తున్నారు. దీంతో రోజువారీగా ఆయా కళాశాలల్లో విద్యార్థుల, అధ్యాపకుల హాజరు నేరుగా ఎంజీయూకు చేరుతుంది. అదే వి ధంగా ప్రతి మాసం వారీగా హాజరుకు సంబంధించిన వివరాల నిజప్రతులను కూడా వర్సిటీ కళాశాలలు సమర్పించాలి. డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లను కల్పించే దిశగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్(దోస్త్) అమలు చేస్తుంది. గతేడాది అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవడంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యా లు ఇబ్బందులు పడడంతో ఈ పర్యాయం ముందస్తుగానే విద్యాసంవత్సరం ప్రారంభంలోగా అడ్మిషన్లను ముగించే దిశగా చర్యలు తీసుకుంది. దాని లో భాగంగా ఏప్రిల్ -2018 మొదటి వారంలోగా వి వరాలు అందచేయాలని ఆదేశాలు జారీచేసింది. నిబంధనలమేరకు బయోమెట్రిక్ మిషన్స్ ఏర్పాటు చేసి (ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక్క మిషన్‌చొప్పున) పూర్తి ఆధారాలతో ఎంజీయూ అకడమిక్ ఆడిట్ సెల్‌కు వివరాలు అందించేయాలి. ఆ కళాశాలల వివరాలను మాత్రమే దోస్త్‌కు వర్సిటీ అధికారులు అందచేశారు. ఎన్ని కళాశాలలు 2018-19కి ఎంజీయూ పరిధిలో పనిచేస్తాయో వేచి చూడాల్సిందే.
Tags:Check to Bogus Attendance in Mahatma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *