Natyam ad

జగనన్న చేయూత లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

కావలి ముచ్చట్లు:


జగనన్న చేయూత పథకానికి చేయూత ఇవ్వని వరుణుడు.  కురుస్తున్న వర్షాల కారణంగా  పొంగిపొర్లుతున్న మున్సిపాలిటీ డ్రైనేజీలు.  జోరువానలో జగనన్న చేయూత పథకం చెక్కులను  లబ్ధిదారులకు అందించిన మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి. గత ప్రభుత్వం హయాంలో పథకాలు లబ్ధిదారులకు అందనీయకుండా జన్మభూమి కమిటీ ల మింగేశాయంటున్న  మంత్రి  కాకాణి   .3 వ విడత చేయూత 7195 మంది లబ్ధిదారులకు 13,49,06,250/- రూపాయల  ల చెక్కులను అందజేసిన మంత్రి కాకాణి , రామిరెడ్డి లు. జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన లబ్ధిదారులు. 3వ విడత జగనన్న చేయూత పథకం ఇచ్చినందుకు కేక్ కట్ చేసిన మంత్రి కాకాణి.

 

 

కావలి పట్టణంలోని మండల పరిషత్  కార్యాలయంలో  3వ విడత జగనన్న చేయూత పథకం చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ,మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి , నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ జోరువాన పడుతున్న జగనన్న చేయూత పథకాలను ఆందుకోవటానికి  లబ్ధిదారులు సమావేశాలకు వచ్చి కుర్చీలలో కూర్చోవటం చాలా ఆనందంగా ఉందని లబ్ధిదారులు కూర్చోకుండా మేము వచ్చే లోపల మీరు వెళ్ళిఉంటే కొన్ని మీడియా పత్రికలు వారి దృష్టిని ఆ కుర్చీలపైకి మళ్ళించి వారు మంత్రిగారి ప్రసంగం మొదలెట్టే సమయానికి కుర్చీలు ఖాళీగా ఉన్నాయని అపప్రద లేకుండా చేశారని అలాగే ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్యమంత్రి కి సన్నిహితుడుగా ఉండి మీ నియోవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నాకు చాలా సంతోషం ఉందని నేను నావంతు సహకారాన్ని మీ నియోజకవర్గానికి అందింస్తానని మంత్రి లబ్ధిదారులకు హమీ ఇచ్చారు.

 

Post Midle

Tags: Checks are distributed to the beneficiaries of Jagananna Chayutha

Post Midle

Leave A Reply

Your email address will not be published.