సుప్రీమ్ కోర్ట్ నిబంధనలమేరకు తనిఖీ లు

రాజంపేట ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు పోలీస్, ఎస్ ఈ బీ, మైన్స్ అండ్ జెయాలజీ,పంచాయతీరాజ్, రెవిన్యూ, ఇరిగేషన్, ఆర్ టీ వో,ఆర్ డబ్ల్యూ ఎస్ డిపార్ట్మెంట్ లకు చెందిన మండల్ లెవెల్ సాండ్ కమిటీ ఆధ్వర్యంలో రాజంపేట పరిధిలోని చెయ్యేరు నది పై ఉన్న బాలరాజుపల్లి, శేషమాంబపురం, మందరం, నారాయణ నెల్లూరు, కోమం తరాజపురం, టంగుటూరు, కుమారునిపల్లి సాండ్ రీచులను సుప్రీమ్ కోర్ట్ నిబంధనలమేరకు తనిఖీ లు నిర్వహించడమైనది. సదరు ప్రదేశాలలో మరియు ఎక్కడైనా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక త్రవ్వకాలు జరిపినచో కఠిన చర్యలు తీసుకొన బడును. ఎవరైనా అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించిన సమాచారంను 9440902595 – ఎస్ ఈ బీ ఇన్స్పెక్టర్ వారికి తెలియజేయవలసిందిగా కోరడమైనది. ఈ తనికీలలో మైన్స్ అండ్ జెయాలజీ ఆర్ ఐ ఆడమ్, హామీద భాను, ఏం వీ ఐ వినోద్, ఎస్ ఐ సుభాష్ చంద్ర బోస్, ఈ ఎస్ ఐ సంధ్య, AEE, RWS గిరిధర్, తదితరులు లు పాల్గొన్నారు.

 

 

Tags:Checks as per Supreme Court Rules

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *