పుంగనూరులో సెర్ఫ్ సీ ఈవో ఇంతియాజ్‌చే చెక్కులు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర సెర్ఫ్ సీ ఈవో ఇంతియాజ్ రూ.16.68 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. శనివారం పీడి రామతులసి ఆధ్వర్యంలో స్థానిక వెలుగు కార్యాలయాన్ని ఇంతియాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా 8 మంది మహిళలకు ఎన్‌ఆర్‌ఎల్‌ఎం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోను అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలను అన్ని రంగాల్లోను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతోందన్నారు. పీడి మాట్లాడుతూ మండలంలోని 25 గ్రూపులకు రూ.2.50 కోట్ల రుణాలు ఎస్‌బిఐ ద్వారా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వైస్ చైర్మన్ నాగేంద్ర, ఏపిఎం రవికుమార్, సీసీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Checks distributed by CerfCEO Imtiaz at Punganur
