సబ్‌పోస్టాఫీసులో అక్రమాలపై తనిఖీలు

Date:29/06/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలకేంద్రంలోని సబ్‌పోస్టాపీసులో సోమవారం పోస్టల్‌ ఇన్‌ స్పెక్టర్‌ రె డ్డిశేఖర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. గతంలో అక్కడ పనిచేసిన సిబ్బంది పై వచ్చిన ఆరోపణ లపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయ న పేర్కొన్నారు. పోస్టాపీసులో ఖాతాదారులు చెల్లించిన నగదు విషయమై తేడాలు ఉన్నాయని వచ్చిన ఫీర్యాధులపై స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు మూడు రోజులపాటు పోస్టల్‌ ఖాతాదారుల పుస్తకాలలో నమోదైన వివరాలను ఆన్‌లైన్‌ లో గల వివరాలనుపరిశీలించి ఖాతాదారులకు తెలియజేస్తామన్నారు. మరో రెండు రోజులపాటు తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.అనంతరం అక్రమాలపై వెల్లడిస్తామన్నారు. పోస్టల్‌ శాఖలో సేవింగ్స్, ఆర్‌డి, తదితర ఖాతాలున్న లబ్దిదారులు పోస్టాఫీసులకొచ్చి వివరాలను తెలుసుకోవాలని కోరారు. తనిఖీలు మొదలవ్వడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గుండెల్లో దడ మొదలైంది.

స్మశానవాటికల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి

Tags: Checks on irregularities in subpost office

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *