Natyam ad

చెడ్డి గ్యాంగ్ హల్ చల్

యాదాద్రి ముచ్చట్లు:


యాదాద్రి భువనగిరి జిల్లాలో చెడ్డి గ్యాంగ్ మరోసారి విరుచుకుపడుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితమే చెడ్డి గ్యాంగ్ జిల్లాలో భారీ దోపిడీకి పాల్పడమే కాకుండా విలువైన ప్రాణాలను సైతం తీసుకెళ్లింది.  రాష్ట్రవ్యాప్తంగా చర్చ అంశంగా మారిన చెడ్డి గ్యాంగ్ ను బీబీనగర్ లోనే గుర్తించారు. పోలీసులు తిరిగి బీబీనగర్ లోనే ఈ చెడ్డి గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతుండడంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బీబీనగర్ మండలం మహాదేవపురం గ్రామంలో చెడ్డీ గ్యాంగ్ వేణుగోపాలస్వామి ఆలయంలో దొంగతనంకు ఎత్ని ఇచ్చింది పోలీసులు బయటపెట్టారు. పోలీసులు బయటపెట్టిన తర్వాత స్థానికంగా ఆ దొంగతనం జరిగే విధానాన్ని చూసి ఇది గతంలో చేసిన చెడ్డి గ్యాంగ్ పని అని స్థానికంగా మారింది. ఎట్టకేలకు ఏదేమైనా చెడ్డి గ్యాంగ్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిషర ప్రాంతాల్లో సంచరిస్తుందని ప్రజలు భయభ్రాంతులకు గురి కావలసిన పరిస్థితి నెలకొంది. పోలీస్ అధికారులు గట్టి నిఘా  వేసి చెడ్డి గ్యాంగ్ ను పట్టుకోవాలని మరో ఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Cheddi Gang Hull Chal Chal

Post Midle
Post Midle