Natyam ad

తెలుగుకు మేలు చేసే ప్రకటనల పట్ల హర్షం

అమరావతి ముచ్చట్లు:

తెలుగు భాషా సంస్కృతులకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తామని జనసేనాని  పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు ప్రపంచ తెలుగు రచయితల సంఘం సంతోషం ప్రకటించింది. తెలుగు భాషను సముద్దరించటానికే కూటమి ఏర్పడిందని కేంద్ర గృహమంత్రి, భాజపా నేత  అమిత్ షా చేసిన ప్రకటన భాషాభిమానులందరికి ఆనందం కలిగించిందని అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు ప్రధాన కార్యదర్శి డా. జి వీ పూర్ణచందు హర్షం వెలిబుచ్చారు. తెలుగు భాషోద్ధారణ అనే అంశాన్ని ప్రజల దృష్టికి, రాజకీయ నేతల దృష్టికి తీసుకు వెళ్లేందు కోసం ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన ప్రముఖ కవి, గేయరచయిత  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు అలాగే అంతర్జాతీయ అచ్చ తెలుగు అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందించారు. తెలుగు భాషకు తాను అంకితమైనానని ప్రకటించిన మండలి బుద్ధప్రసాద్ ని ప్రపంచ తెలుగు రచయితల సంఘం ముఖ్యులు అవనిగడ్డ లోని వారి ఇంటికి వెళ్ళి అభినందనలు అందించారు. ఈ ఎన్నికల్లో తెలుగు ఒక ప్రచారాంశం కావటం వలన భవిష్యత్తులో తెలుగుకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Post Midle

Tags: Cheers for announcements that benefit Telugu

Post Midle