Natyam ad

ఆ వ్యాఖ్యాలను ఖండించిన చేగొండి

ఏలూరు ముచ్చట్లు:

పవన్ కళ్యాణ్ టిడిపి పొత్తు పై చేసిన వ్యాఖ్యలు కాపులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు,మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలోనూ ఓ ప్రముఖ దిన పత్రిక లోను  ప్రచారం చేయడాన్ని జోగయ్య తీవ్రంగా ఖండించారు.ఏ ఆధారాలు లేకుండా తాను ప్రకటించినట్లు సోషల్ మీడియా,ప్రముఖ దినపత్రికలో ప్రచురితం కావడం దురదృష్టకరం అన్నారు.కాపు సంక్షేమ సేన జనసేన పార్టీకి ఎప్పుడూ విధేయత గా ఉంటుందని వ్యాఖ్యానించారు.ఎన్నికలు తర్వాత  సిఎం ఎవరన్నది నిర్ణయం తీసుకుంటామని జగన్ ను గద్దె దించేందుకు మాత్రమే టిడిపి జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అని  పవన్ కళ్యాణ్వ్యాఖ్యానించారు అన్నారు.పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు విషయంలో మాట్లాడిన వ్యాఖ్యలు జన సేన కార్యకర్తలు లో ఆనందాన్ని నింపింది అన్నారు. సోషల్ మీడియా,ఒక ప్రముఖ దినపత్రికలో తాను చేసినట్లు  అసత్య వార్త   ప్రచురితమైన అసత్య ప్రచారాలను ప్రజలు  నమ్మవద్దు అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య ప్రజలను కోరారు.

 

Post Midle

Tags: Chegondi denied those comments

Post Midle