కెమికల్ పేలి కార్మికుడికి తీవ్రగాయాలు

Date:05/12/2019

అనంతపురం ముచ్చట్లు:

అనంతపురం జిల్లా  మడకశిర పట్టణంలోని శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్యాలయం ముందు ఆర్డినరీ అనే కెమికల్ బ్లాస్ట్ కావడంతో కిష్టప్ప అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. విధి నిర్వహణలో భాగంగా  గురువారం  ఉదయం నీటి పైపులను  అతుకు వేయడం లో భాగంగా కార్యాలయంలో ఉన్న  ఆర్డినరీ అనే కెమికల్ తీసుకొని కార్యాలయం వెలుపలికి  వచ్చిన వెంటనే  ఉన్నపళంగా  కెమికల్ బ్లాస్ట్ కావడంతో కార్మికుడు కిష్టప్ప  తీవ్ర గాయాలు పాలవడంతో జరిగింది గమనించిన తోటి సిబ్బంది  మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హిందూపురం ఆసుపత్రికి తరలించారు. గత 15 రోజులుగా విధినిర్వహణలో ఉంటూనే శ్రీ రామ్ రెడ్డి తాగునీటి కార్మికులు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఈ సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

 

సహ ఉద్యోగిపై దాడి…కోమాలో బాధితుడు

 

Tags:Chemical explosions are serious for the worker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *