రసాయన రహిత ప్రకృతి వ్యవసాయమే ముద్దు- ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

– కృష్ణాపురంలో ఉచితంగా డ్రమ్ములు, టార్ఫాలిన్ పట్టాలు పంపిణీ

 

కృష్ణాపురం ముచ్చట్లు:

 

రైతులు రసాయన రహిత ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించాలని ఎమ్మెల్యే  కోనేటి ఆదిమూలం  అన్నారు.శుక్రవారం నాగలాపురం మండలం కృష్ణాపురం లో PMAJAY పథకం ద్వారా షెడ్యూలు కులాల రైతులకు ఉచితంగా ప్రకృతి వ్యవసాయ పనిముట్లైన టార్ఫాలిన్ పట్టలు, డ్రమ్ములు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తమ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  పెన్షన్ కార్యక్రమాన్ని పెంపు కార్యక్రమాన్ని జూలై ఒకటినే దిగ్విజయం చేశారన్నారు.ఇదే విధంగా పేదలకు అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందించనున్నారు.తనను గుర్తించి టికెట్టు ఇచ్చి తన గెలుపుకు అన్నీ విధాలుగా ఆదరించిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కి, మంత్రి  నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.నాకు ద్రోహం చేసిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు.. నేను ప్రజల్లో ఉన్నాను..!ఎన్నికల సమయం లో నాకు ద్రోహం చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు.. నేను ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో ఉన్నానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం  తన ఆవేదనను వెళ్లగక్కారు.తాను ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ కష్టపడ్డానని, ప్రజలు, భగవంతుడే తనను ఈ స్థానంలో ఉంచారని ఎమ్మెల్యే ఆదిమూలం గారు భావోద్వేగానికి గురయ్యారు.అనంతరం రైతులకు సబ్సిడీ జనుము, జీలగ విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస యాదవ్, టిడిపి పట్టణ అధ్యక్షులు ప్రణీత్ రెడ్డి, ఏఓ సుబ్బారావు, ప్రకృతి వ్యవసాయ అధికారి నీల, టిడిపి నాయకులు ఎస్ ఎం సురేష్, మండేల, కుమార్, సర్పంచ్ మహేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Chemical free natural farming is the origin of MLA Koneti

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *