ఇస్రోకు ఎంపికైన చెన్నూర్‌ విద్యార్థి

Date:30/11/2020

మంచిర్యాల  ముచ్చట్లు:

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో)లో జూనియర్‌ సైంటిస్ట్‌గా మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ విద్యార్థి మోతె శ్రావణ్‌కుమార్‌ ఎంపికయ్యాడు.చెన్నై ఐఐటీలో బీటెక్‌ (ఎలక్ట్రికల్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌) ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. క్యాంపస్‌ నుంచి ఆరుగురు విద్యార్థులకు ఒకే రోజు పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో శ్రావణ్‌ ఎంపికైనట్టు ఇస్రో ప్రకటించింది.ఈయన నర్సరీ నుంచి పదోతరగతి వరకు చెన్నూర్‌ లోని చిన్న మున్షి పబ్లిక్‌ స్కూల్‌లో చదివాడు. హైదరాబాద్‌లో ఇంటర్‌ పూర్తిచేసి, 2017 జేఈఈ లో ఆలిండియా స్థాయిలో 1652వ ర్యాంక్‌తో చెన్నైలోని ఐఐటీలో సీటు సాధించాడు.

ప్రమాదంలో విద్యుత్‌ స్తంభం

Tags: Chennur student selected by ISRO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *