చోటా..గాడ్ ఫాదర్ : కాజల్

Chhota..gad father: kajal

Chhota..gad father: kajal

Date:26/11/2018
ముంబై ముచ్చట్లు:
ఒక్క ముద్దు.. ఒకే ఒక్క ముద్దు.. ఆ ముద్దే కుర్ర హీరో సినిమాకి ‘కవచం’లా మారింది. సినిమా విడుదలకు ముందు ముద్దుపై గబ్బు రేగటంతో ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది ‘కవచం’ సినిమాకి. అయితే ఆ ముద్దు హీరో హీరోయిన్ల మధ్య కాదు. సినిమాటోగ్రాఫర్‌కి టాలీవుడ్ చందమామ కాజల్‌కి మధ్య జరిగిన ముద్దూ ముచ్చట ఇది. టాలీవుడ్ అందాల చందమామ కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌కి జోడీగా ‘కవచం’ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రి రిలీజ్ వేడుకలో సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు స్టేజ్ మీద కాజల్ అగర్వాల్‌ని కౌగించుకొని ముద్దు పెట్టేశాడు. దీంతో ఛోటా కె బహిరంగంగా ముద్దు పెట్ట డంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాజల్ లైట్ తీసుకున్నా.. చాలామంది ఛోటా మీద కన్నెర్రజేశారు. ఇక కాజల్ ఫ్యాన్స్ అయితే ఒక అడుగు ముందుకేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి ఛోటా కె నాయుడుని బ్యాన్ చేయాలన్నారు. అతనిపై సోషల్ మీడియా యుద్ధం ప్రకటించారు. దిగొచ్చిన ఛోటా కె.. తప్పైపోయింది బాబూ అన్నా శాంతించడం లేదు. తాజాగా ఈ ముద్దు రచ్చపై కిస్ రుచి చూసిన అందాల చందమామ కాజల్ స్పందిస్తూ.. ఆ ఛోటా ముద్దులో తప్పేముంది. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నన్ను చాలా ప్రోత్సహిస్తారు. కెరియర్ ఆరంభంలో చాలా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన నాకు గాడ్ ఫాదర్ లాంటి వాళ్లు అంటూ.. ముద్దుపై వివాదానికి ఇక్కడితే ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు కాజల్.
Tas:Chhota..gad father: kajal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *