చోటా నాయకుల చోరీ,డికెటి భూములు కాళీ,
-అరాచకానికి అడ్రస్.. తొట్టంబేడు మండలం,
తొట్టంబేడు ముచ్చట్లు:
తొట్టంబేడు మండలం లో పలు పంచాయతీలలో చోటా నాయకులు సిండికేట్ అయ్యి, ఖాళీ ఉన్న బంజరు భూములు, మరియు బీడుగా ఉన్న డికెటి భూములు, అన్యాయంగా అక్రమంగా వాటిని కబ్జా చేస్తూ అధికార పార్టీ అండ మాకు అంటూ, పేద మధ్యతరగతి వాళ్ళ పై ప్రతాపం చూపుతు,డికెటి భూములు,ను ఆక్రమిస్తూ రాత్రికి రాత్రే విత్తనాలు నాటడం, చల్లడం, బిల్డింగులు కట్టడం ,రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వంటివి చకచకా జరిగిపోతున్నాయి. ఇది అన్యాయమని అధికారులకు మొరపెట్టుకున్నా, అధికారులు అందరూ కూడా అధికార పార్టీ బానిసలై,అక్రమ కేసులు పెట్టడం తప్ప మేము చేసేది ఏమీ లేదు అంటూ, కేసులు వస్తున్నాయి ఇందులో భాగమే చిట్టత్తూరు, శివ నాద పాలెం ,శివ నాథ పురం ,భవానీ శంకరాపురం, రౌతు సూరమాల, కాసరం, చియ్యవరం ,చోడవరం, ఒకటేమిటి మండలం లో,ఎక్కడా ఖాళీ కనబడినా ఆ స్థలం రాత్రికిరాత్రే ఆన్లైన్లో అనుకున్నవాళ్ళు పేరుతో దర్శనమిస్తుంది, దీనిని అరికట్టాలంటే ఆనాటి ప్రజా పోరాటాలే ముఖ్యం దున్నేవాడికే భూమి అన్న నినాదంతో తెలంగాణ శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు,సాక్షిగా యువతరం పోరాటాలకు రావాలి, ఎర్ర జెండా బాటలో యువతరం కలిసివచ్చే, పల్లెల నుండి ప్రజా పోరాటాలు కు యువతరం పిడికిలి బిగించాలి అని కోరుకుంటున్నాం.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Chhota leaders’ theft, DKT lands vacated,