Natyam ad

కోడి, మద్యం పంపిణీ-వైరల్ గా మారిన వీడియోలు

విశాఖపట్నం ముచ్చట్లు:

 

దసరా పండగ సందర్భంగా విశాఖలో అధికార వైఎస్సార్‌సీపీ నేత స్థానికులకు కానుకల్ని అందించారు. దక్షిణ మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్‌ కోడి, మద్యం బాటిల్ పంపిణీ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విశాఖలోని డాబా గార్డెన్స్‌లో వైఎస్సార్‌సీపీ కార్యాలయం దగ్గర ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ పంపిణీ చేపట్టారు. అధికార పార్టీ నేత ఆనంద్ సుమారు 120 మందికి కోడి, మద్యం బాటిల్ అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

 

Tags: Chicken, distribution of alcohol-videos that have gone viral

Post Midle
Post Midle