తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Justice Ranjan Gogoi, Chief Justice of the Supreme Court, who visited Sri Padmavati Amman.

Justice Ranjan Gogoi, Chief Justice of the Supreme Court, who visited Sri Padmavati Amman.

Date:16/11/2019

తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని శ‌నివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్‌కు టిటిడి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్‌, అర్చ‌కులు ఇస్తిక‌ఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో  సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రిండెంట్  కుమార్‌,  ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 

చిన్నారి వర్షిణి హత్య కేసును ఛేదించిన పోలీసులు

 

Tags:Chief Justice of the Supreme Court of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *