Date:17/11/2019
తిరుమల ముచ్చట్లు:
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్‌కు టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఈవో, అదనపు ఈవో శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాధ్, విజివో మనోహర్, పేష్కార్ లోకనాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:Chief Justice of the Supreme Court, who visited Tirumala Srivari