అమరావతీ ముచ్చట్లు:
ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌తో భేటీ అవుతారు.కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. సాయంత్రం శ్రమశక్తి భవన్ లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపైన సుదీర్ఘంగా చర్చించారు. ఈసమావేశంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అప్పలనాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి విందులో పాల్గొన్నారు చంద్రబాబు.
Tags;Chief Minister Chandrababu is busy during the tour.