రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ భోగి పండగ శుభాకాంక్షలు
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Chief Minister Jagan Bhogi wishes the people of the state a happy festival