పుంగనూరులో మంత్రులను, ఎంపిలను అప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి జగన్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్‌ఆర్‌ జగన్న కాలనీ పనుల ప్రారంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిర్వహించారు. పట్టణంలోని నక్కబండ వద్ద కాలనీ లేఔట్లు ప్రారంభ కార్యక్రమం కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడుతూ రామచంద్రారెడ్డి అన్న బాగున్నారా…. నారాయణస్వామి అన్న బాగున్నారా అంటు అప్యాయంగా పలకరించారు. అలాగే ఎంపి రెడ్డెప్ప, గురుమూర్తిని పలకరించారు. ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, శ్రీనివాసులు, వెంకటేగౌడ, నవాజ్‌బాషాలను పేరుపేరున పలకరించారు. మాస్క్లు వేసుకోవడంతో గుర్తు చిక్కడం లేదు అంటు సీఎం అనడంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు మాస్క్లు తొలగించారు. ఈ కార్యక్రమంలో జేసి వీరబ్రహ్మం, హౌసింగ్‌ జిల్లా పీడీ పద్మనాభన్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ పాల్గొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: Chief Minister Jagan greeted the ministers and MPs in Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *