కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి హార్షం
వై ఎస్ ఆర్ టీ యు సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారపరెడ్డి రాజారెడ్డి
తిరుపతి ముచ్చట్లు;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖలల్లో గత ఐదు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న పది వేల మందిని రెగ్యులరైజ్ చేస్తూ బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలిలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొన్న సహాసోపేత మైన నిర్ణయంపై హార్షం వ్యక్తం చేస్తున్నట్లు వై ఎస్ ఆర్ టీ యు సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారపరెడ్డి రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్ లల్లో పర్మనెంట్ ఉద్యోగస్తులను కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను మరియు కార్మికులను మాత్రమే భర్తీ చేసాడని, చాలా మంది ఎప్పటికైనా పర్మనెంట్ చేస్తారనే ఆశతో గత అనేక సంవత్సరాలగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అనేకసార్లు వాళ్ళు కలిసి విన్నవించుకున్న వారిని పర్మనెంట్ చేయలేదని విమర్శించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎవరు అడగకున్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా వారికీ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయడం సంతోషంచ దగ్గ విషయమని అన్నారు.
Tags: Chief Minister Jagan Mohan Reddy’s decision to regularize the contract workers is furious
