పుంగనూరులో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

పుంగనూరు ముచ్చట్లు:
 
అగ్రవర్ణాలోని పేద మహిళలకు ఈబిసి నేస్తం క్రింద రూ.15 వేలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అందించారు. ఇందుకు కృతజ్ఞత పూర్వకంగా లబ్ధిదారులు సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో సమావేశమై, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి జిందాబాద్‌…మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిందాబాద్‌ అంటు జేజేలు పలికారు. ఏముఖ్యమంత్రి అగ్రవర్ణాలలోని పేదలను పట్టించుకుని ఆర్థిక సహాయం అందించలేదని లబ్ధిదారులు తె లిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్‌ రసూల్‌ఖాన్‌, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత , కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌,రేష్మా, యువకుమారి, నరసింహులు, జేపి యాదవ్‌, కాళిదాసు, తుంగామంజునాథ్‌ పాల్గొన్నారు.
 
Tags; Chief Minister Jaganmohan Reddy was anointed to paint in Punganur

Leave A Reply

Your email address will not be published.