పేదల అభ్యున్నతే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయం
సోమల ముచ్చట్లు:
పేదల అభ్యున్నతే సీఎం జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని సోమల ఎంపీపీ ఈశ్వరయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కామిరెడ్డిగారిపల్లె,వల్లిగట్ల,తమ్మినాయనిపల్లె పంచాయతీలలో సర్పంచ్ లు శ్రీదేవి,సౌజన్య,సురేంద్ర రెడ్డి ల ఆధ్వర్యంలో రూ.2250 నుంచి రూ.2500 పెంచిన వైఎస్సార్ పెన్షన్ కానుకను లబ్దిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లో ప్రకటించిన నవరత్నాల హామీలను అమలు చేస్తున్నారని కొనియాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలతో పాటు ప్రజలకు ఇవ్వని హామీలను కూడా అమలు చేసి క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలపై స్టేలు తీసుకొచ్చి ఆభివృద్ధిని అడ్డుకుంటోందని అన్నారు. కులమత పార్టీ ప్రాంతీయ బేదాల్లేకుండా అందరికి పెన్షన్ లు ఇస్తూ.. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్న తమ్మినాయునిపల్లి పెగలవారిపల్లికి చెందిన సుబాష్ నాయుడికి కామిరెడ్డివారిపల్లి యర్రంవారిపల్లి కి చెందిన ధర్మయ్య నాయుడికి వృద్ధాప్య పెన్షన్ లు మంజూరు చేసిన ఘనత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
సోమల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యదర్శి చింతల రవీంద్రనాథ్ రెడ్డిలు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి హయంలో కులాలు, పార్టీలకు అతీతంగా ప్రజలంద రికీ సంక్షేమపథకాలు అందించి పేదల పాలిట పెన్నిది అయ్యారని కొనియాడారు.అనంతరం నూతనంగా మంజూరైన పెన్షన్ లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఆర్బీకే చైర్మన్ వెంకటేష్,ఎంపీటీసీ సభ్యులు సయ్యద్ భాషా,కళ్యాణి, ఉప సర్పంచ్ లు మాథవి,రామలక్ష్మమ్మ,నాయకులు ఎల్ కేటి రాజారెడ్డి, బాల సుబ్రమణ్యం, నిరంజన్ రెడ్డి,క్రాంతి రెడ్డి,ఈఓపీఆర్డీ ఎస్ఎ.గపూర్,కార్యదర్శి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Chief Minister Jagan’s mission is to uplift the poor