Natyam ad

కుప్పం అభివృద్ధి పై ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక దృష్టి

– జనంవైపు జగన్‌…జగన్‌వైపు జనం
-కుప్పంలో గెలిచేది మేమే….
– మంత్రి పెద్దిరెడ్డి ధీమా

పుంగనూరుముచ్చట్లు:

Post Midle

నిర్లక్ష్యానికి గురైన కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేశారని….అభివృద్ధిని చూసి కుప్పం ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని , కుప్పంలో గెలిచేది వైఎస్సార్‌సీపీనేనని, ఎన్నికల డ్రామాలలో పొత్తుల పార్టీలతో మాకు పనిలేదని , నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పేవారని , అలాగే చేస్తున్నారని , జనంవైపు జగన్‌…జగన్‌ వైపు జనం…ఉన్నారని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పుంగనూరు మండలం నల్లగుట్లపల్లె, ఏతూరు, పెంచుపల్లి గ్రామాల్లో మోటారు సైకిల్‌ ర్యాలీని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గానికి ఏమి చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటఇచ్చిన మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కరువుకాలంలో కుప్పంకు హంద్రీనీవా నీటిని తరలించి, మాట నిలబెట్టుకుని జగన్‌ రికార్డు సృష్టించడం జరిగిందన్నారు. కుప్పం అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయము, డిఎస్పీ కార్యాలయము ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే కుప్పం పంచాయతీని మున్సిపాలిటిగా మార్పు చేసి పక్కా భవనాలు నిర్మించామన్నారు. అలాగే మున్సిపాలిటి అభివృద్ధికి రూ.60 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. ఎవరు ఊహించని రీతిలో కుప్పం నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించి , వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామన్నారు. జిల్లాలోని అన్ని స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ మెంబరు పోకల అశోక్‌కుమార్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి పాల్గొన్నారు.

జగన్‌వైపు జనం…

రాష్ట్రంలో రాబోవు ఎన్నికల్లో పొత్తుల పార్టీలు ఎన్ని వచ్చిన తమకు నష్టం ఏమి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా రాష్ట్రంలో పరిపాలన సాగించిన జగన్‌మోహన్‌రెడ్డి వైపు జనం ఉన్నారని , జనంవైపు జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఒక్కహామి అయినా నేరవేర్చార అనే విషయాలను ప్రజలు మరచిపోలేదని , చంద్రబాబుకు తగిన గుణపాఠం నేర్పి రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిస్తారని తెలిపారు.

 

Tags: Chief Minister Jagan’s special focus on Kuppam development

Post Midle