ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సృహ లేదు

Chief Minister KCR is not conscious

Chief Minister KCR is not conscious

కేసీఆర్ పై సాధినేని యామిని ఫైర్
Date:31/12/2018
అనంతపురం ముచ్చట్లు:
నక్కకి చీకటి తెలియదు.. గుడ్లగూబకి వెలుగు తెలియదు అలానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సోయ లేదు. సృహ లేకుండా మాట్లాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని ఖండిచారామె. ‘మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై అక్కసును వెళ్లగక్కారు కేసీఆర్. నేను ముఖ్యమంత్రిని కదా ఏమి మాట్లాడినా చెల్లుతుందనే ధోరణిలో ఉన్నారు. ఆయన అలా మాట్లాడటటానికి కారణం చంద్రబాబుపై ఉన్న ద్వేషం ఒక్కటే కాదు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందుకు ఉన్నదనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మోడీతో కలిసి కుట్రలు చేస్తున్నా.. చంద్రబాబు అభివృద్ది పథంలో ముందుకు పోతున్నారు.
దాన్ని చూసితట్టుకోలేక కేసీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ మాట్లాడితే థర్డ్ ఫ్రంట్ అంటున్నారు. కాని ఆయనది థర్డ్ డోర్ బాపతు. అందుకే మోడీని కలిసి ప్యాకేజీ మాట్లాడుకుని వచ్చి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ బీజేపీ ముసుగేసుకుని ఎన్ని సూట్ కేసులు తీసుకుని వచ్చారో తెలియదు కాని నీచాతినీచంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయకపోతే తల నరుక్కుంటా అన్నాడు. ఇచ్చిన హామీలను నెలవేర్చకపోతే తల తీసుకుంటా అన్నాడు కేసీఆర్. ఆ సందర్భంగా నేను కేసీఆర్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నా.. మీరు ఇప్పటి వరకూ ఎన్నిసార్లు తల నరుక్కున్నారు.
ఎన్నిసార్లు మీ తల ముక్కలైంది? ఎన్నిసార్లు అతికించుకుని మోడీ దగ్గర నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఊసరవిల్లిలా మాట్లాడుతున్నారు. అప్పుడేమో తెలంగాణాకి హోదా ఇస్తే హైదరాబాద్‌కి పరిశ్రమలు రావని అడ్డుకుంది మీరు కాదా? ఇప్పుడేమో మాట మార్చి ఊసరవిల్లిలా మాట్లాడుతున్నారు. మాట్లాడితే చంద్రబాబు మామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారు అంటున్నారు అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు పార్టీలో ఉన్నట్లు ప్రజలకు తెలియదా? తెలంగాణ ఇస్తే.. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తా అన్నారు. ఆ మాటను నిలబెట్టుకున్నారా? మీ కుటుంబం మొత్తం పోయి సోనియాగాంధీ కాళ్లపై పడ్డారు.
సైబరాబాద్ టవర్స్ చంద్రబాబు కట్టకపోతే.. మీ తాత ముత్తాతలు దిగొచ్చి కట్టారా? సైబర్ టవర్స్ కడుతున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీకు కనిపించలేదా? అయినా మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్ర హైకోర్టు, న్యాయవాదుల గురించి మాట్లాడితే మీకేంటి నొప్పి. చంద్రబాబు మీ తెలంగాణ జోలికి రావడం లేదు కదా.. తెలంగాణ న్యాయ మూర్తుల గురించి మాట్లాడటం లేదు కదా. మేం శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే మీకేంటి బాధ. మీకు దమ్ముంటే గత నాలుగన్నరేళ్లలో మీరు తెలంగాణలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ సాధినేని.
Tags:Chief Minister KCR is not conscious

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed