మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్

Date:17/10/2020

స్థానిక ఎమ్మెల్యే మీద కేసులు పెట్టాలి

రైతుల మీద పెట్టిన కేసులు తీసి వేయాలి

జగిత్యాల  ముచ్చట్లు:

రైతులు పండించిన ముక్కలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు అనే విషయం మీద నిన్న మెట్ పెల్లి లో జగిత్యాల జిల్లా రైతుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు లు హాజరు అయి ధర్నా చేశారు . ధర్నా చేసిన రైతుల మీద కేసు లు పెట్టాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు తీవ్రంగా ఖండించారు.
రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తే రోడ్లు ఎక్కి ధర్నా లు ఎందుకు చేస్తారు అని అన్నారు.. కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వాళ్లే ఈ రోజు రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఏర్పడింది అన్నారు.. కొట్లాడి సాదించుకున్నా తెలంగాణ రాష్ట్రం లో ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదు అని అన్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబ కోసం ఏ రాష్ట్రం వచ్చినట్లు ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారు అని అన్నారు తెలంగాణ వచ్చినక పదవుల కల్వకుంట్ల కుటుంబ లో పదవులు వచ్చాయి గాని రాష్ట్ర ప్రజలకు గాని రైతులు గాని ఎలాంటి ప్రయోజనం జరగలేదు.. తక్షణమే రైతులు మీద పెట్టిన కేసులు తీసి వేసి. ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్. స్థానిక ఎమ్మెల్యే మీద కేసులు పెట్టాలని జువ్వాడి కృష్ణ రావు అన్నారు… రైతులు ఇంత పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పందించకపోవడం మీ ప్రభుత్వం పని తీరు నిదర్శనం అని అన్నారు.. అలాగే ప్రభుత్వం బేషరతుగా ముక్కలను కొనుగోలు చేయాలని.. అదే విధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల ను ఇవ్వాలని జువ్వాడి కృష్ణ రావు డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పడు అండగా ఉండే పార్టీ అని రైతులు పక్షాన నిలబడే పార్టీ అని రైతులకు అన్యాయం చేయలని చూస్తే ఉరుకునేది లేదు అని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణ రావు అన్నారు.

 

 ఆర్టీసీ డిపోలో కోవిద్  పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

Tags:Chief Minister KCR missed the word

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *