ముఖ్యమంత్రి యువ నేస్తం అభినందన సభను జయప్రదం చేయండి

Chief Minister of the Youth Nasthana congratulates the House

Chief Minister of the Youth Nasthana congratulates the House

Date:21/09/2018

టి ఎన్ ఎస్ యఫ్ జాతీయ సమన్వయ కర్త రవి నాయుడు

పలమనేరు ముచ్చట్లు:

తెలుగునాడు విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి యువ నేస్తం అభినందన సభను జయప్రదం చేయాలని జాతీయ టిఎన్ఎస్ఎఫ్ సమన్వయకర్త రవి నాయుడు అన్నారు .శుక్రవారం సభ జరిగే డిగ్రీ కళాశాల ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా యువ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని , యువత భవిష్యత్తు కోసం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలను తీసుకురా లేదన్నారు .

 

యువతకు తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అలాగే పట్టణం లోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని  తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) జాతీయ సమన్వయకర్త రవి నాయుడు శుక్రవారం తనిఖీ చేశారు.వసతి గృహంలోని విద్యార్థులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు .అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం ,విద్య అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.

వసతి గృహాలలో అనేక సదుపాయాలు కల్పించి ప్రైవేటు వసతి గృహాలకు దీటుగా ప్రభుత్వ వసతి గృహాలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం దే అన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు కనుక విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.

వసతి గృహంలో సదుపాయాలు అరకొరగా ఉండడంతో సమస్యను మంత్రి అమర్నాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లాఉపాధ్యక్షుడు పిబి బాలసుబ్రమణ్యం, నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు నదీమ్, కార్యదర్శి మోహన్, డిగ్రీ కళాశాల అధ్యక్షుడు సునీల్, ప్రధాన కార్యదర్శి మోహన్,  తదితరులు పాల్గొన్నారు.

అంతరాష్ట్ర కబడ్డీ పోటీలకు పుంగనూరు సిద్దం

Tags:Chief Minister of the Youth Nasthana congratulates the House

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *