Natyam ad

ఏటీసీ టైర్ల కంపేనిని ప్రారంభించిన ముఖ్యమంత్రి

అనకాపల్లి ముచ్చట్లు:


అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీ ఎస్ఈజెడ్లో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ను  సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తరువాత అయన  మరో 8 కంపెనీలకు భూమిపూజ నిర్వహించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం అవుతాయి. ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దేవుడి దయతో ఒక పరిశ్రమను ప్రారంభోత్సవం చేసుకోవడంతోపాటు,  రెండో దశ ప్లాంట్ విస్తరణ పనులకూ శంకుస్ధాపన చేశాం.  యోకహోమా జపనీస్ టైర్ల తయారీ పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ.. కంపెనీ గురించి చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా మొదటి 5–6 స్ధానాల్లో తమ కంపెనీ ఉందని, రాబోయే రోజుల్లో టాప్ 3 లోకి పోబోతున్నామని చెప్పారు. అలాంటి కంపెనీ మన రాష్ట్రానికి రావడం సంతోషకరం.  2020 సెప్టెంబరులో మన దగ్గరకు వచ్చారు. అక్కడనుంచి చక,చకా అన్ని రకాలుగా మద్ధతు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఫిబ్రవరి 2021లో పనులు ప్రారంభించి కేవలం 15 నెలల కాలంలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తిలోకి వచ్చిందని అన్నారు.

 

 


మనమిచ్చే ప్రోత్సాహంతో రెండో దశకూ శ్రీకారం.
మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకుంది. అందుకే రెండోదశకు కూడా నాందిపలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్రాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే… మరోవైపు సెకెండ్ ఫేజ్కు శంకుస్ధాపన కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగష్టు 2023లోగా పూర్తి చేస్తామని చెపుతున్నారు. తొలిదశలో రూ.1250 కోట్ల రూపాయలతో దాదాపు 1200 మందికి ఉద్యోగాలు ఇక్కడే కల్పించారు. ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2000 మందికి ఉపాధి ఇక్కడే.. మన పిల్లలకే అందుబాటులోకి వస్తుందని అన్నారు.
ఇవన్నీ కూడా ఎందుకు చెపుతున్నానంటే…. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా ఆ ప్రాంతంలో మన పిల్లలకు మెరుగైన ఉద్యోగాలు అందడం చాలా అవసరం.  అలా ఆప్రాంతంలో చదువుకున్న మన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇక్కడే మనం ఇప్పించగలిగితే.. పేదరికం నుంచి మన పిల్లలు బయటపడే పరిస్థితులు ఇంకా మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా మనం చేయాల్సినవి అన్నీ కూడా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామని అన్నారు.
ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే.. ఎలా పరిష్కరించుకోవాలి, ఏరకంగా గొడవ పడకుండా

 

 

Post Midle

పరిష్కరించాలనుకోవాలన్నదానిపైన మనం అడుగులు వేయాలి. అప్పుడే ఆ పారిశ్రామిక వేత్తలకూ నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు వాళ్లు పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. అప్పుడు మన పిల్లలకు పుష్కలంగా ఉద్యోగాలు వస్తాయి. మన వాళ్లు చాలా మంచి వాళ్లు, బాగా కష్టపడి పనిచేసేవాళ్లు, ఎటువంటి సమస్యలు సృష్టించరు అని వాళ్లు ఎప్పుడు అనుకుంటారో… అప్పుడు మన రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి. ఆ బాధ్యత మన భుజాల మీద ఉందని… సీఎం  వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,  పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Tags: Chief Minister who launched ATC Tires Company

Post Midle

Leave A Reply

Your email address will not be published.