పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి – దేవినేని అవినాష్

విజయవాడ ముచ్చట్లు:
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల సంక్షేమం కొరకు ముఖ్యంగా మహిళలకు లబ్ది చేకూరే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని 16 వ డివిజిన్ నందు పర్యటించిన అవినాష్ డివిజిన్లో అత్యధికంగా 10 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన 6 లక్షల 50 వెల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని జగన్ గారు ఒక కుటుంబ సభ్యుడిలా అండగా వుంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న సరే నిరకటంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని కొనియాడారు. అదేవిధంగా కరోనా నివారణ చర్యలు గాని,వ్యాక్సినేషన్ ప్రక్రియ గాని సజావుగా సాగుతోంది అంటే అది ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలన దక్షతకు నిదర్శనం అని తెలిపారు. పేద ప్రజల మోములో చిరునవ్వు చూడాలనే లక్ష్యంగా పరిపాలన అందిస్తున్నారని అన్నారు.ఒక పక్క జగన్ గారి పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు అని,ఇప్పటికైనా వారు ఆ జూమ్ మీటింగ్ లు వదిలి బయటకు వచ్చి వాస్తవాలు చూడాలని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం లో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని,ఈ ప్రభుత్వం లో వచ్చిన ఉద్యోగాలు ఎన్నో చర్చ కు సిద్ధమా అని సవాల్ విసిరారు.16 వ డివిజిన్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు,జగనన్న తోడు,చేయూత, ఆసరా,పెన్షన్లు మంజూరు కు కార్పొరేటర్ రాధిక గారి విశేష కృషి చేశారని అన్నారు. మాజీ కార్పొరేటర్ బహుదూర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనివిధంగా నియోజకవర్గ అభివృద్ధిపనులు గాని,కరోనా విపత్కర పరిస్థితుల్లో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కార్యక్రమంలు చేపట్టిన అవినాష్ గారు ఇన్ ఛార్జ్ గా ఉండడం మా అదృష్టం అని,రాబోయే ఎన్నికల్లో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించుకొంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక,సీనియర్ నాయకులు బహుదూర్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Chief Minister working for the welfare of poor people
– Devineni Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *