Natyam ad

విశాఖ విమానాశ్రయం చేరుకున్న  ముఖ్యమంత్రి  వై యస్ జగన్

-ఘన స్వాగతం పలికిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు

విశాఖపట్నం  ముచ్చట్లు:


రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  శ్రీకాకుళం జిల్లా , నరసన్నపేటలో పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ నుండి విశాఖ విమానాశ్రయానికి ఉదయం చేరుకున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, బి .వి .సత్యవతి,  జి. మాధవి, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున, విఏంఆర్డిఎ చైర్పర్సన్  అక్కరమాని విజయనిర్మల ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్,  జీవీఎంసీ కమీషనర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్,  డిప్యూటీ పోలీస్ కమీషనర్ సుమిత్ సునీల్ గరుడ్ ,ఆర్డీవో  హుస్సేన్ సాహెబ్, తదితరులు పుష్ప గుచ్చాలు అందజేసి ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో  శ్రీకాకుళం జిల్లా కు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వెళ్లారు.

 

Post Midle

Tags: Chief Minister YS Jagan reached Visakhapatnam Airport

Post Midle

Leave A Reply

Your email address will not be published.